10వ తరగతి ఫలితాల్లో టాపర్గా స్టేషన్ హై స్కూల్ విద్యార్థిని

10వ తరగతి ఫలితాల్లో టాపర్గా స్టేషన్ హై స్కూల్ విద్యార్థిని

కేసముద్రం, ఆంధ్రప్రభ : తాజాగా విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో జడ్పిహెచ్ఎస్ కేసముద్రం స్టేషన్ విద్యార్థిని మొహమ్మద్ అప్రా నిక్ఖత్ 566 మార్కులు సాధించి మండలంలో మొదటి స్థానం సంపాదించడం జరిగింది. అలాగే కేసముద్రం స్టేషన్ హై స్కూల్ 100శాతం ఫలితాలు సాధించి 4 మొదటి స్థానం నిలవడం జరిగింది. అలాగే 500 మార్కులకు పైగా పాఠశాల నుండి 7గురు విద్యార్థులు సాధించడం అభినందించదగిన విషయం.

ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి రాజు, ఉపాధ్యాయులు జి శ్రీనివాస్, పి నరసింహారెడ్డి, బి మదన్మోహన్, ముదిగిరి సదయ్య, ఏ సురేష్, డాక్టర్ కొమ్ము రాజేందర్ లు అభినందించడం జరిగింది.

Leave a Reply