Oct2025 | రూ.1000 కోట్ల బకాయిల విడుదల..
Oct2025 | రూ.1000 కోట్ల బకాయిల విడుదల..
October 2025 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. పెండింగ్లో ఉన్న రూ.1000 కోట్ల బకాయిలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. దీంతో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు భారీ ఊరట లభించింది.
ఇప్పటివరకు నెలవారీగా రూ.700 కోట్ల చెల్లింపులు జరుగుతుండగా, వాటిని ఇప్పుడు రూ.1000 కోట్లకు పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో బకాయిల చెల్లింపులు మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.
రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ బకాయిలను కూడా ప్రభుత్వం క్లియర్ చేసింది. 2025 అక్టోబర్ వరకు ఉన్న పెండింగ్స్ అన్నింటినీ పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయంతో వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపై ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి.
