కానిస్టేబుల్ వృత్తిలో ఉండి…

కానిస్టేబుల్ వృత్తిలో ఉండి…
ధారూర్, ఆంధ్రప్రభ : ఓ మహిళ కానిస్సేబుల్ మృతి చెందిన సంఘటన స్టేషన్ ధారూర్ గ్రామంలో ఈ రోజు ఉదయం చొటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ఉన్నాయి. స్టేషన్ ధారూర్ గ్రామానికి చెందిన డేగవత్ తుల్సిభాయి (23) తండ్రి రాములు పోలీస్ గా విధులు నిర్వహిస్తుంది.
ఇంట్లో గోడవల కారణంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని అత్మ హత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృత ధేహన్ని పోస్టు మార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. భాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
