గ్రామ గ్రామాన ఎర్రజెండాను ఎగురవేద్దాం

గ్రామ గ్రామాన ఎర్రజెండాను ఎగురవేద్దాం

  • సీపీఐ జిల్లా నాయకులు పోకల వెంకటేశ్వర్లు

గరిడేపల్లి, ఆంధ్రప్రభ : ప్రపంచ కార్మిక దినోత్సవం (మేడే)ను పురస్కరించుకొని ప్రతి గ్రామంలో ఎర్రజెండాలు ఎగురవేసి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పోకల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.

మంగళవారం గరిడేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సిపిఐ మండల కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా మండలంలోని అన్ని గ్రామాల్లో ఏఐటీయూసీ అనుబంధ సంఘాల కార్మికులు, పార్టీ కార్యకర్తలు ఎర్రజెండాలను ఎగురవేసి మేడే వేడుకలను నిర్వహించాలని కోరారు. కార్మికుల ఐక్యతను చాటిచెప్పే గొప్ప వేదికగా మేడేను అభివర్ణించారు.

ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు త్రిపురం సుధాకర్ రెడ్డి, మండల కార్యవర్గ సభ్యులు యడ్ల అంజిరెడ్డి, కుందూరు వెంకటరెడ్డి, చేవ్వా వెంకన్న, మామిడి శ్రీను, పోకల ఆంజనేయులు, పందిరి నాగయ్య, ప్రతాని సైదులు, పంగ సైదులు, మెండే లింగరాజు, తాళ్ల తిరుపయ్య, వేశాల ఆంజనేయులు, గోవిందు, నబీ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply