High Court | పైలట్ రోహిత్ రెడ్డికి ఊరట
High Court | పైలట్ రోహిత్ రెడ్డికి ఊరట
High Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు భారీ ఊరట కల్పించింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రోహిత్ రెడ్డి, తనపై నమోదైన కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కేసుకు సంబంధించిన ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్‌పై నిర్ణయం వెలువరించారు.
ధర్మాసనం విధించిన షరతుల మేరకు బెయిల్ మంజూరు కావడంతో ఇవాళే ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఏర్పడింది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో జరిగిన తాజా పరిణామం మరోసారి రాజకీయ వేడిని పెంచింది.
