వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో

వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో
దండేపల్లి, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన వారి ధాన్యం మొక్కజొన్న కొనుగోలు చేయాలని సోమవారం దండేపల్లి మండలంలోని ముత్యంపేట జాతీయ రహదారిపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పత్తిపాక సంతోష్,రైతులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వాన్ని నమ్మ బలికి రైతులను రాజులాగా చూస్తామని ఇప్పుడు రైతు పండించిన పంటను కొనడంలో హీనంగా చూస్తుందని అన్నారు.
రైతు లేనిదే రాజ్యం లేదని రైతు తలుచుకుంటే రాజ్యాలు కూలిపోతాయని రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ప్రభుత్వాన్ని నిలదీయడం తప్పదని అన్నారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పది రోజులు గడిచిన ఒక గింజ కూడా తూకం వేయలేదని ఎప్పటికైనా ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నారు. రోజురోజు మారుతున్న వాతావరణన్ని చూస్తూ రైతులు భయాందోళనకు గురవుతున్నారు అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
రైతులు, నాయకులు రాస్తారోకి చేయడంతో రెండు పక్కల వాహనాలు భారీగా నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న, దండేపల్లి ఎస్సై తహసీనుద్దీన్ అక్కడికి చేరుకొని దండేపల్లి తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే తో రైతులను ఫోన్ లో మాట్లాడించగా వారు రేపటి నుండి ధాన్యం కొనుగోలు మొదలు పెడతామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముత్తె అనిల్, బోడకుంటి వెంకటేష్, బెడద సురేష్, కర్ణాల కిషన్, వల్లంబట్ల శ్రీనివాస్, చుంచు గిరిధర్, ముత్తె వెంకటేష్, పత్తిపాక శ్రీనివాస్ ,మొoడయ్య, బుచ్చన్న, హరీష్, స్వస్తిక్, ప్రసాద్, గురువయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.
