AP CM | పెట్రోల్‌, డీజిల్‌ బ్లాక్‌మార్కెటింగ్‌పై చంద్రబాబు హెచ్చరిక

AP CM | పెట్రోల్‌, డీజిల్‌ బ్లాక్‌మార్కెటింగ్‌పై చంద్రబాబు హెచ్చరిక

AP CM | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌, డీజిల్‌ కృత్రిమ కొరత సృష్టించడం, బ్లాక్‌మార్కెటింగ్‌కు పాల్పడడం సహించబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులకు ఆయన కఠిన ఆదేశాలు జారీ చేశారు.

ప్రతి మూడు గంటలకు ఒకసారి పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన సరఫరా, నిల్వలు, పంపిణీపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.

మీడియా, సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై వెంటనే స్పందించాలని, ప్రజల్లో అనవసర భయాందోళనలు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తప్పుడు ప్రచారం, అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

సాయంత్రానికి రాష్ట్రంలోని మెజార్టీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొంటుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని సీఎం తెలిపారు.

Leave a Reply