రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్


నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అలాగే తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ….ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో నిలిపిన పార్టీ BRS పార్టీ అన్నారు,26సంవత్సరాల పార్టీ ప్రస్థానంలో ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ పునః నిర్మాణం కోసమే బి.అర్.యస్ పనిచేసిందని కె.సి.అర్ నాయకత్వములో వ్యవసాయ,పారిశ్రామిక,I.T రంగాలలో అద్భుతమైన ప్రగతి సాధించిందని అన్నారు.వ్యవసాయ రంగంలో 2కోట్ల 50లక్షల మంది ఉపాధి పొందారని,I.T రంగాలలో 6లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించాయని,24గంటల కరెంటు వల్ల పారిశ్రామిక ప్రగతి సాధించిందని అన్నారు.ఇంటింటికి మంచి నీళ్ళు,రైతు బంధు,రైతు ఋణ మాఫీ,రైతుభీమ,కళ్యాణ లక్ష్మి, కె.సి.అర్ కిట్టు,బతుకమ్మ చీరలు,రంజాన్ కానుక,వంటి వినూత్న పథకాలతో సంక్షేమ పథకాలలో చరిత్ర సృష్టించారన్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు,రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు స్థాపించి 2లక్షల ఉద్యోగాలు కల్పించారని అన్నారు,అభివృద్ధితో దూసుకుపోతున్న కె.సి.అర్ ను నిలువరించేందుకు కాంగ్రెస్,బి.జె.పి వంటి కుహనా రాజకీయ పార్టీలు కుట్రలు, కుతంత్రాలను పన్ని దుష్ప్రచారం చేసి ప్రజలకు తీరని ద్రోహం చేశాయని అన్నారు.రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి శ్రీశైలం,బాలాగౌడ్,పట్టణ కౌన్సిలర్స్ తిమ్మాజిపేట పాండు,కొత్త గంగాధర్,మంతటి గ్రామ సర్పంచ్ శ్రీను ,మాజీ పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాములు, మాజీ సర్పంచ్లు నాగయ్య, బొడ్డు రమణ,నర్సింహ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, పార్టీ నాయకులు బాబు రావు,అర్థం రవి,కరణ్ లాల్, ఎల్లయ్య,అలూరి నరేందర్,ఎలిమె సత్యం,కిషోర్,పార్థసారథి,విష్ణు సాగర్,రాజేష్ రెడ్డి,పుల్లయ్య,ముకేష్,పాలమూరి శివ,రమణ,రాజేష్,రమణ,జానకిరాములు యాదవ్,వెంకటేష్,బాలరాజు,పలువురు పాల్గొన్నారు. పలువురు పార్టీ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.