మంత్రి నిధులు తీసుకొచ్చి పల్లె సీమలు అభివృద్ధి చేస్తాం…

మంత్రి నిధులు తీసుకొచ్చి పల్లె సీమలు అభివృద్ధి చేస్తాం…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి తో నిధులు తీసుకొచ్చి పల్లె సీమలు అభివృద్ధి చేస్తామని ఊట్కూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి. యగ్నేశ్వర్ రెడ్డి, అమీన్ పూర్ సర్పంచ్ టప్ప నాగేష్ అన్నారు. గురువారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఆమీన్ పూర్ కుర్వవీధిలోగ్రామపంచాయతీ నిధులు రూ.5 లక్షలతో సిసి రోడ్డు పనులుప్రారంభించారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందనిఅన్నారు. గ్రామాల్లో నెలకొన్న వివిధ సమస్యలను అధికారులు ప్రజా ప్రతినిధులు స్వయంగా పరిశీలించి సమస్యలు పరిష్కరించేందుకే ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికినాందిపలికిందని అన్నారు. ప్రభుత్వం పేదల అవసరాలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తుందనిఅన్నారు. ఉచిత బస్సు, రైతురుణమాఫీ, మహిళలకు రుణాలు రైతుభరోసా, తెల్ల రేషన్ కార్డులు వంటి ఎన్నో పథకాలుప్రవేశపెట్టిందనిఅన్నారు. ఎన్నికలముందుప్రజలకుఇచ్చిన హామీలను దశలవారీగా పరిష్కరించేందుకుకృషి చేస్తామన్నారు. గత 30 ఏళ్లుగా కుర్వ వీధిలో మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతుండగా గుర్తించి సీసీ రోడ్డు డ్రైనేజీలు బోరు మోటర్ వేయించామనిఅన్నారు.

ప్రజలు గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వేసవి కాలంలో విద్యుత్ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతామని అన్నారు. కుర్వ వీధిలో సిసి రోడ్డు ఏర్పాటు చేయడంతో సర్పంచ్ నాగేష్ ను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పగిడిమర్రి సర్పంచ్ జాఫర్, ఉప సర్పంచ్ రవీందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అశోక్ గౌడ్, మాజీ సర్పంచ్ యశోదమ్మ, మాజీ ఎంపీటీసీ అనితశేఖర్ రెడ్డి, మాదాసి కుర్వ సంఘం తాలూకా అధ్యక్షులు అంజప్ప, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
