Biopic | రుక్మిణి వసంత్ కి లక్కీ ఛాన్స్…?

Biopic | రుక్మిణి వసంత్ కి లక్కీ ఛాన్స్…?

Biopic | గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్?
సాయిపల్లవి తప్పుకుందా..? రుక్మిణి ఎంట్రీపై చర్చ
సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన
గౌతమ్ తిన్ననూరి తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి

Biopic | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఒకరు చేయాల్సిన పాత్రను మరొకరు చేయడం అనేది ఇండస్ట్రీలో అప్పుడప్పుడు జరుగుతుంటుంది. తాజాగా ఫిదా బ్యూటీ సాయిపల్లవి చేయాల్సిన పాత్రను కన్నడ బ్యూటీ (Beauty) రుక్మిణి వసంత్ చేస్తుందని.. గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంతకీ.. ఏ సినిమాలో సాయిపల్లవి చేయాల్సిన పాత్రను రుక్మిణి చేస్తుంది..?

Biopic | గీతా ఆర్ట్స్ నిర్మాణంలో..?

ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ గత కొంతకాలంగా ప్రచారంలో ఉంది. ఈ బయోపికల్లో ఎం.ఎస్. సుబ్బలక్ష్మిగా ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటించనున్నట్టుగా ప్రచారం జరిగింది. ఆమెకు ఈ కథ గురించి చెబితే.. వెంటనే చేస్తానని చెప్పిందట. దీంతో ఎం.ఎస్. సుబ్బలక్ష్మిగా సాయిపల్లవి నటించనున్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. అయితే.. ఇప్పుడు కొత్తగా రుక్మిణి (Rukmini) వసంత్ పేరు వినిపిస్తోంది. దీంతో ఎం.ఎస్. సుబ్బలక్ష్మిగా నటించేది ఎవరు..? సాయిపల్లవా..? రుక్మిణి వసంతా..? అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ.. ఈ క్రేజీ మూవీకి డైరెక్టర్ ఎవరంటే.. గౌతమ్ తిన్ననూరి. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది.

Biopic | మిశ్రమ స్పందన..

సాయిపల్లవి క్లాసికల్ డాన్స్ బ్యాక్‌గ్రౌండ్ కారణంగా ఈ పాత్రకు సరైన ఎంపికగా భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని.. అందుకే రుక్మిణి వసంత్ ను తీసుకున్నారని.. టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో (social Media) ఈ విషయంపై మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు అభిమానులు రుక్మిణి వసంత్ సౌమ్యమైన స్క్రీన్ ప్రెజెన్స్, సుబ్బలక్ష్మి వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటాయని అభిప్రాయపడుతుండగా, మరికొందరు సాయి పల్లవే ఈ పాత్రకు సరైన ఎంపికని కామెంట్లు పెడుతున్నారు.

Biopic | కింగ్ డమ్ తర్వాత..

కర్ణాటక సంగీత ప్రపంచంలో మహానుభావురాలైన ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. ఆమె భారత రత్న పురస్కారం అందుకున్న తొలి సంగీత విదుషి కావడం విశేషం. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, విజయ్ (Vijay) దేవరకొండ నటించిన కింగ్ డమ్ చిత్రం నిరాశపరిచిన తర్వాత ఈ బయోపిక్‌ పై తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రతస్తుం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని సమాచారం. మరి.. సుబ్బలక్ష్మిగా రుక్మిణి వసంత్ నటిస్తుందా..? లేదా..? ఎప్పుడు సెట్స్ పైకి రానుంది అనేది క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a Reply