2026 Us Shooting News : గన్ డ్రామా Andhra Prabha Top Story

2026 Us Shooting News : గన్ డ్రామా Andhra Prabha Top Story

  • 36,000 కోట్లు వృథా
  • భద్రతలో డొల్లతనం
  • సెక్యూరిటీకి షాక్..!
  • వైట్​ హౌస్​ తెల్ల ముఖం
  • ఒకే ఒక్కడి పక్కాప్లాన్​
  • హోటల్​ లోనే గన్స్​ రెడీ
  • నివ్వెర పోయిన ప్రపంచం

( ఆంధ్రప్రభ, వాషింగ్టన్​ ప్రతినిధి)

2026 Us Shooting News

అమెరికా భద్రత వలయం అంటే… వామ్మో అనాల్సిందే. అధ్యక్షుడు ఎక్కడికి వెళ్తే.. అక్కడ ఏడాది ముందే.. సీక్రెట్​ ఏజెంట్లు మకాం వేస్తారు. అధ్యక్షుడిపై ఏమాత్రం కుట్ర జరుగుతున్నా.. ఇట్టే పట్టేస్తారు. కానీ.. అమెరికాలో.. హిల్​ టన్​ హోటల్​ లో వైట్​ హౌస్​ కరెస్పాండెంట్లతో.. కాక్​ టెయిల్​ డిన్నర్​లో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు.. ఆమన సతీమణి.. ఇతర సకుటుంబ సపరివారం.. అకస్మాత్తుగా ప్రాణభయంతో బిక్కచచ్చిపోయారు. ఏటా ₹36,000 కోట్ల వ్యయంతో అమెరికా అధ్యక్షుడిని కాపాడుతున్న సీక్రెట్​ సర్వీసెస్​ ఏజెన్సీ నివ్వెరసోయింది. ఒకే ఒక్కడు.. నేర చరిత్ర లేని విద్యావంతుడు. ఓ యువకుడు ఈ పంక్షన్​ లో విలన్​ గా మారాడు. కాల్పులు జరిపాడు. భద్రత దళాలకు చిక్కాడు. కానీ.. భద్రత దళాల నిఘా వ్యవస్థ ఎందుకు నిద్ర పోతోందనే ఆరోపణలు.. ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి.

2026 Us Shooting News : వైట్​ హౌస్​… మౌనం

2026 Us Shooting News

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరైన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో జరిగిన కాల్పుల ఘటన, దేశంలోని అత్యున్నత అధికారులకు కల్పిస్తున్న భద్రత, రక్షణపై ప్రశ్నలను లేవనెత్తింది. ఈ కార్యక్రమంలో కాల్పులు జరపడానికి, దుండగుడు హోటల్‌లోని నియంత్రిత ప్రవేశ మార్గాన్ని, లెక్కలేనంత మంది సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను దాటుకుని లోపలికి ప్రవేశించాడు. హిల్​ టన్​ బాల్‌రూమ్‌లో ఆసక్తికర సంభాషణలు జరుగుతున్నాయి. ఈ ఆడంబర మీడియా విందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తన పరిపాలనలోని ఇతర సభ్యులతో కలిసి ప్రధాన బల్ల వద్ద కూర్చున్నారు.
డిన్నర్‌లో బురాటా ప్లేటర్‌ను వడ్డిస్తున్న సమయంలో, పెద్ద శబ్దాలు వినిపించాయి, ఆ వెంటనే ‘కిందకు వంగండి’ ‘కిందనే ఉండండి’ అనే కేకలు వినిపించాయి. ఆ తర్వాత తెలిసిన విషయమేమిటంటే, ఒక దుండగుడు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఆ కార్యక్రమ ప్రదేశంలోకి చొరబడి కాల్పులు జరిపాడు. దీంతో జర్నలిస్టులు, ఇతర సభ్యులు ప్రాణభయంతో తలదాచుకోగా, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అమెరికా అధ్యక్షుడిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు.

2026 Us Shooting News : సెక్యూరిటీ ఉలికిపాటు

2026 Us Shooting News

ఏప్రిల్ 25, 2026 శనివారం రాత్రి వాషింగ్టన్ హిల్‌టన్ హోటల్‌లో భద్రతా వలయాలను ఛేదించినప్పటికీ… అత్యంత కీలక వలయంలో చిక్కుకుపోయాడు.
నిందితుడు రాత్రి 8:36 గంటల ప్రాంతంలో హోటల్ లాబీలోని ప్రధాన మెటల్ డిటెక్టర్ (Magnetometer) చెక్‌పాయింట్ వద్దకు ఆయుధాలతో దూసుకువచ్చాడు. హోటల్ తొలి మానవ కంచెను సులువుగా దాటాడు. కోలే థోమస్​ అలెన్​ ​ అదే హోటల్‌లో గెస్ట్‌గా బస చేయడంతో సాధారణంగా హోటల్ లోపలికి వెళ్ళేటప్పుడు బయటి తనిఖీల నుంచి తప్పించుకున్నాడు. హోటల్ ప్రవేశ ద్వారాల దగ్గర మెటల్ డిటెక్టర్లు లేకపోవడంతో అతనికి కలిసి వచ్చింది.

2026 Us Shooting News


ఇక ప్రెసిడెంట్ విడిది బాల్‌రూమ్ వెలుపల రెండవ కంచెకు (Security అడ్డంగా దొరికి పోయాడు. అక్కడి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లపై కాల్పులు జరిపి బాల్‌రూమ్ లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశాడు. అప్పటికే భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. అతడిని నేలపై పడవేసి (Tackled) అదుపులోకి తీసుకున్నారు. ఇలా నిందితుడు అత్యంత సురక్షిత ఇన్నర్ సర్కిల్ (Ballroom) లోకి మాత్రం ప్రవేశించలేకపోయాడు.

ఇదొక పక్కా ప్లాన్​

2026 Us Shooting News

అన్ని లేయర్ల సెక్యూరిటీ, స్కానింగ్ మిషన్లు ఉన్నప్పటికీ.. షాట్‌గన్, హ్యాండ్‌గన్ ఐదారు కత్తులను హోటల్ లోపలికి ఎలా తీసుకెళ్లగలిగాడు? ఇంటెలిజెన్స్ వర్గాలకు ఇంతటి ప్లాన్ గురించి కనీస సమాచారం ఎందుకు అందలేదు? నిందితుడు కోల్​ థోమస్​ అలెన్​ గతంలో టీచర్ ఆఫ్ ది మంత్ అవార్డు పొందిన వ్యక్తి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. అతడిపై ఎటువంటి అనుమానం కలగలేదు.
ఇదే హిల్‌టన్ హోటల్‌లో బస చేసిన గెస్ట్ అని సమాచారం. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్లో హోటల్ గెస్టులకు బయటి లేయర్లలో కొంత వెసులుబాటు ఉంటుంది, దానినే అతను అవకాశంగా తీసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

2026 Us Shooting News : హోటల్​ లోనే గన్​ రెడీ

వాషింగ్టన్ హిల్‌టన్ ఒక లగ్జరీ 4-స్టార్ హోటల్. ఇక్కడ ఒక రాత్రి బస చేయడానికి అయ్యే ఖర్చు సీజన్ మరియు రూమ్ రకాన్ని బట్టి మారుతుంటుంది:
సాధారణంగా ఒక రాత్రికి $ 200 నుంచి $400 (సుమారు ₹16,500 నుండి ₹33,000) వరకు ఉంటుంది. కొన్ని బుకింగ్ సైట్లలో (ఉదాహరణకు Momondo) తక్కువ ధరలు అంటే సుమారు ₹10,674 నుండి కూడా అందుబాటులో ఉండవచ్చు.
వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వంటి పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉండి, ధరలు $500 దాటవచ్చు. సరీగా.. ఇదే హోటల్​లో త్వరలొ వైట్​ హౌస్​ కరెస్పాండెంట్లకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ డిన్నర్​ ఇస్తున్నారనే సమాచారంతోనే కోల్ థోమస్ అలెన్ చాలా పక్కా ప్లాన్‌తోనే వాషింగ్టన్ హిల్‌టన్ హోటల్‌కు వచ్చాడని దర్యాప్తులో తెలుస్తోంది:
వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్’ (WHCD) అనేది ప్రతి ఏటా జరిగే ఒక బహిరంగ కార్యక్రమం. ఈ ఏడాది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వేడుకకు హాజరవుతున్నారనే విషయం కొన్ని వారాల ముందే అధికారికంగా ప్రకటించారు.
పట్టుబడిన తర్వాత అలెన్ పోలీసులతో మాట్లాడుతూ, తన లక్ష్యం “ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు” అని ప్రాథమికంగా ఒప్పుకున్నాడు. ఆయుధాలను నేరుగా తెచ్చాడా? లేక అసెంబుల్ చేశాడా? సాక్షుల కథనం ప్రకారం, అతను ఆయుధాలను హోటల్ లోపలే అసెంబుల్ చేసినట్లు తెలుస్తోంది . హోటల్ ప్రవేశం వద్ద బార్ కార్ట్‌లు (Bar carts) ఉంచే ఒక చిన్న గదిలో (ఏరియాలో) ఎటువంటి సెక్యూరిటీ లేని సమయం చూసి అతను అక్కడికి వెళ్ళాడు. ఒక వలంటీర్ (Helen Mabus) తెలిపిన వివరాల ప్రకారం, అలెన్ ఒక బ్యాగ్ నుండి విడిభాగాలను తీసి “లాంగ్ వెపన్” (షాట్‌గన్) ను అక్కడ అసెంబుల్ చేశాడు. ఆయుధం సిద్ధం చేసుకున్న వెంటనే అతను నేరుగా సెక్యూరిటీ చెక్ పాయింట్ (Magnetometer) వైపు పరుగెత్తుకుంటూ వెళ్ళి కాల్పులు జరిపాడు. అతను ఒక హోటల్ అతిథిగా సెక్యూరిటీ కన్నుగప్పి ఆయుధ భాగాలను లోపలికి తెచ్చి, వేదికకు సమీపంలోనే కూర్చి.. దాడికి ప్రయత్నించాడు.

నేర చరిత్ర లేదు

2026 Us Shooting News

నిందితుడు కోల్ టోమస్ అలెన్ (31) అత్యంత ప్రతిష్టాత్మక కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Caltech) నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని (2017), కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ (2025) పూర్తి చేశాడు. అతను గతంలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేశాడు ప్రస్తుతం స్వతంత్ర గేమ్ డెవలపర్ (Independent Game Developer) గా ఉన్నాడు. అదనంగా, అతను C2 Education లో పార్ట్ టైమ్ టీచర్‌గా పనిచేస్తూ, “టీచర్ ఆఫ్ ది మంత్” అవార్డును కూడా అందుకున్నాడు. అతను 2024లో డెమొక్రాటిక్ పార్టీకి చిన్న మొత్తంలో విరాళాలు కూడా ఇచ్చినట్లు రికార్డులు ఉన్నాయి.
మొత్తంగా చూస్తే, అతను విద్యావంతుడు, ఆర్థికంగా స్థిరంగా ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేదని దర్యాప్తు సంస్థలు తెలిపాయి

సీక్రెట్​ ఏజెన్సీకే షాక్​

2026 Us Shooting News

అమెరికా అధ్యక్షుడి భద్రత ప్రపంచంలోనే అత్యంత కఠినమైంది. అమెరికా అధ్యక్షుడి రక్షణ బాధ్యతను సీక్రెట్ సర్వీస్ నిర్వహిస్తుంది. ప్రధానంగా మూడు అంచెల్లో (Levels ఈ భద్రత చేపడుతుంది, అధ్యక్షుడికి అత్యంత సమీపంలో ప్రెసిడెన్షియల్ ప్రొటెక్టివ్ డివిజన్ (PPD) ఏజెంట్లు పహారా కాస్తారు. 24 గంటలూ ఆయన వెంటే ఉంటారు. ఇది తొలి కంచె. వైట్ హౌస్ కార్యక్రమ వేదికల చుట్టూ ఉండే యూని ఫామ్డ్ డివిజన్ (Uniformed Division) అధికారులు పహారా కాస్తారు. ఇది రెండవ కంచె. వీరు మెటల్ డిటెక్టర్లు, బాంబు తనిఖీలను పర్యవేక్షిస్తారు. స్థానిక పోలీసు యంత్రాంగం, నేషనల్ గార్డ్స్ సహాయంతో వేదిక బయట ఉండే ట్రాఫిక్ సాధారణ రక్షణ బాధ్యతలు చూస్తారు. ఇది మూడవ కంచె. అధ్యక్షుడి భద్రత కోసం సుమారు 300 మంది ఏజెంట్లు నేరుగా విధుల్లో పాల్గొంటారు. మొత్తం సీక్రెట్ సర్వీస్‌లో సుమారు 8,000 మందికి పైగా ఉద్యోగులు (ఏజెంట్లు, ఆఫీసర్లు, టెక్నికల్ స్టాఫ్) పనిచేస్తున్నారు.

2026 Us Shooting News : సీక్రెట్ ఏజెన్సీ విధులేంటి?

2026 Us Shooting News

సీక్రెట్ సర్వీస్ కేవలం అధ్యక్షుడికి అంగరక్షక బాధ్యతలే కాదు. ..
ప్రెసిడెంట్ వెళ్ళే ప్రతి ప్రదేశాన్ని కొన్ని వారాల ముందే తనిఖీ చేసి భద్రతా ప్రణాళికను సిద్ధం చేస్తారు. వేదిక సమీపంలో ప్రతి వ్యక్తిని మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేస్తారు. స్నిఫర్ డాగ్స్ (K-9)ను రంగంలోకి దించి బాంబులను గుర్తిస్తారు.
కానీ,, ఏప్రిల్ 25, 2026న జరిగిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ (WHCD) ఘటనలో సీక్రెట్ సర్వీస్ అనేక విమర్శలను ఎదుర్కొంటోంది. నిందితుడు కోల్ థోమస్ అలెన్ అదే హోటల్‌లో బస చేశాడు. అతిథి కావడంతో, అతను హోటల్ లోపల ఆయుధాలను అసెంబ్లీ చేసే అవకాశం లభించింది. ఆయుధాలతో అతను సెక్యూరిటీ చెక్ పాయింట్‌ను ఎలా ఛేదించి లోపలికి దూసుకురాగలిగాడు అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. నిందితుడికి ఎటువంటి నేర చరిత్ర లేకపోవడం, అతను ఒక ఇంజనీర్ మాజీ టీచర్ కావడంతో ఇంటెలిజెన్స్ వర్గాలు అతనిని ముప్పుగా గుర్తించలేకపోయాయి. ప్రస్తుతం కోల్ అలెన్‌ను విచారిస్తున్న అధికారులు, ఈ భద్రతా లోపానికి ఖచ్చిత కారణాలను విశ్లేషిస్తున్నారు.

ALSO READ : 3 Attempts : వైట్ హౌస్‌లోనే షాక్ Andhra Prabha Top Story