వాసవి మాతను ఆదర్శంగా తీసుకోవాలి
వాసవి మాతను ఆదర్శంగా తీసుకోవాలి
- కన్యకా పరమేశ్వరి జయంతిలో తెలంగాణ ఆర్య వైశ్య
- మహాసభ ఉపాధ్యక్షుడు తోపాజీ అనంత కిషన్
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : వాసవి మాతను ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు తోపాజీ అనంత కిషన్ ఉన్నారు. జిల్లా యువజన, క్రీడా శాఖ సంగారెడ్డి ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి మాత 4644వ జయంతి వేడుకలను ఆదివారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు తోపాజీ అనంత కిషన్ ముఖ్యఅతిథిగా హాజరై, వాసవి మాత సేవా తత్వం, సమాజానికి చేసిన సేవలను స్మరించారు. మున్సిపల్ కమిషనర్ మట్ట శ్రీనివాస్ రెడ్డి, ప్రముఖులు పుల్లూరి ప్రకాష్, ఎం.రాధాకిషన్, జె.బుచ్చిలింగం, జె.మల్లేశం, ఆర్.విజయలక్ష్మీ (కలెక్టరేట్ సూపరింటెండెంట్) తదితరులు పాల్గొన్నారు. వక్తలు వాసవి మాత ఆచరణీయ విలువలను కొనియాడుతూ, యువత సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి టి.అఖిలేష్ రెడ్డి పర్యవేక్షించారు.
