వైభవంగా శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం..

రుద్రూర్, ఆంధ్రప్రభ : శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని రుద్రూర్ ఫారం ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధన స్థానము ఆధ్వర్యంలో రుద్రూర్ ఫారం నుంచి పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం వద్ద కు పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

పచ్చటి తోరణాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మండలంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణానికి ముందుగా ఉదయం 5:00 కు సుప్రభాతం, 6 గంటలకు అర్చన కార్యక్రమం, భక్తులకు నిర్వాహకులు అన్న ప్రసాదాలను కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణంకు శ్రీ పిట్ల కృష్ణ మహారాజు హాజరై భక్తులకు భక్తి ప్రవచనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాంబాబు, మాజీ సర్పంచ్ తిగుళ్ల గంగామణి రాజా వర ప్రసాద్,భక్తులు, మహిళలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply