బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
- మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలంలోని ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ పరకాల మండల అధ్యక్షులు, పరకాల మాజీ వైస్ ఎంపీపీ చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏప్రిల్ 27 బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా పరకాల మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీ గద్దెలకు రంగులు వేసి ఉదయం 8:00 గంటలకు ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేసి ఉదయం 9:00 గంటలకు మండల గ్రామాల్లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో జరగాలని, మండల నాయకులు, గ్రామ స్థాయి కార్యకర్తలు అందరూ ఐక్యంగా పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయాలని మధుసూదన్ రెడ్డి కోరారు.
