Public Voice | సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

Public Voice | సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

Public Voice | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణలో ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించే లక్ష్యంతో ప్రజావాణి సేవలను రెవెన్యూ డివిజన్ స్థాయికి విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రజలకు ప్రజావాణి సేవలను మరింత చేరువ చేయాలని, రెవెన్యూ డివిజన్‌స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అలాగే అర్జీల పురోగతిని అర్జీదారుడికి తెలియజేయాలన్నారు.

జిల్లా కేంద్రాలకే పరిమితం కాకుండా, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి నిర్వహణ ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాల‌ని సీఎం రేవంత్ ఆదేశించారు. అర్జీల పరిష్కార ప్రక్రియను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారాన్ని డ్యాష్‌బోర్డు ద్వారా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపి, జాప్యాన్ని నివారించాలని సూచించారు.