సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్

ములకలపల్లి, ఆంధ్రప్రభ : ములకలపల్లి మండలంలోని మూకమామిడి గ్రామపంచాయతీ మూడోవ వార్డు లో ఐదు లక్షల రూపాయలు ఎంపీ నిధుల నుండి 90 మీటర్ల పొడవుతో మంజూరైన నూతన సీసీ రోడ్డు పనులను సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి. శనివారం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు .ఈ సందర్భంగా సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి మాట్లాడుతూ.మంజూరైన ఈ సీసీ రోడ్డు నిర్మాణం తో గ్రామస్తుల చిరకాల కోరిక నెరవేరిందని సర్పంచ్ తెలిపారు.గ్రామంలో రోడ్డు సౌకర్యం లేక వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని,ఇకపై ఆ సమస్య తీరుతుందని అన్నారు.
రాబోయే రోజుల్లో మూకమామిడి పంచాయతీ పరిధిలో అన్ని గ్రామల అభివృద్ధికి మరిన్ని నిధులు తెచ్చి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మూడోవ వార్డు సభ్యులు బచ్చేలా చైతన్య కుమారి పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాసరావు గ్రామ పెద్దలు శాస్త్రబోయిన వెంకటేశ్వర్లు,రింగు బాలకృష్ణ,బచ్చల రాజేష్,కోండ్రు శ్రీను,చర్ల వృదయరాజు,ఏనగనీటి బుచ్చయ్య,మిరియాల అరవింద్,కాంట్రాక్టర్ కొండవీటి రాజారావు మరియు గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.సీసీ రోడ్డు మంజూరు చేసి పనులను ప్రారంభించిన సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
