నిరుపేద ఆడబిడ్డలకు వరం ‘కళ్యాణ లక్ష్మి’ పథకం

నిరుపేద ఆడబిడ్డలకు వరం ‘కళ్యాణ లక్ష్మి’ పథకం
- ఎమ్మెల్యే వేడమ బొజ్జు
కడెం, ఆంధ్రప్రభ : నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం నిధులు ఒక వరంలాంటివని ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కడెం రైతు వేదికలో మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిరుపేదల సంక్షేమం కోసం ప్రజా పాలన ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి. భూషన్, కడెం మండల తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్, డిప్యూటీ తహసీల్దార్ లచ్చిరాం, ఎంపీడీవో సునీత, ఎంపీఓ శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు టి. మల్లేష్ యాదవ్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ఎం. మల్లేష్ యాదవ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రెంకల శ్రీనివాస్ యాదవ్, పెద్దూరు, కడెం, అంబారిపేట్, ఎలగడప, పెద్ద బెల్లాల్, నచ్చని ఎల్లాపూర్, బెల్లాల్, రాణిగూడ గ్రామాల సర్పంచులు దీకొండ విజయకుమార్, టి. రమేష్, నర్సింగ్, అశ్విత, బొంతల లక్ష్మి, ఈదుల తిరుపతి, బొడ్డు స్పందన, తొట్ల సీతారాం, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వాజిద్ ఖాన్, షేక్ రఫీక్, బబ్లు, కే. లక్ష్మణ్, బొడ్డు గంగన్న, తొట్ల గంగాధర్, షర్ఫుద్దీన్, సామాజికవేత్త సిహెచ్ రాజేష్ కుమార్, వివిధ గ్రామాల నుండి వచ్చిన లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
