Kavitha | ఆనాటి కేసీఆర్ వేరు.. ఈనాటి కేసీఆర్ వేరు
Kavitha | ఆనాటి కేసీఆర్ వేరు.. ఈనాటి కేసీఆర్ వేరు
Kavitha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేసీఆర్ మన మనిషి కాదు.. మర మనిషి అని కల్వకుంట్ల కవిత అన్నారు. మునీరాబాద్ లో పార్టీని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. ఆనాటి కేసీఆర్ వేరు.. ఇప్పుడు కేసీఆర్ వేరు అన్నారు. ఆనాటి కేసీఆర్ ప్రజలకు చిన్న కష్టం వచ్చినా వాలిపోయేవారన్నారు.
ఇప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా బయటకు రావడం లేదన్నారు. గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో ఖైదీగా మారారన్నారు. కేసీఆర్ రాష్ట్రానికి ఏం చేశారని దేశానికి బయల్దేరారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కర్కోటకుడి పాలన నడుస్తుందన్నారు. ప్రజలు గోస పడుతుంటే మన కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఉద్యమంలో మనల్ని కొట్టి, తిట్టిన వాళ్లు ఇప్పుడు పదవుల్లో ఉన్నారన్నారు.
