lemon water| వేసవిలో రోజూ తాగితే..?

lemon water| వేసవిలో రోజూ తాగితే..?
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : వేసవిలో ఎండల తీవ్రతకు శరీరం త్వరగా అలసిపోతుంది. డీహైడ్రేషన్ సమస్య కూడా తరచుగా వేధిస్తుంటుంది. అయితే, ఇలాంటి సమయంలో ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఒక స్పూన్ తేనె, చిటికెడు ఉప్పు కలిపి తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండొచ్చు.

వేసవిలో నిత్యం నిమ్మరసం తాగితే ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. చెమట వల్ల కోల్పోయిన ద్రవాలను తిరిగి శరీరానికి అందిస్తుంది. దీంతో రోజంతా ఫ్రెష్‌గా ఉండవచ్చు. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తి పెంచి.. జలుబు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. అలాగే చర్మానికి కూడా మంచి గ్లో వస్తుంది.

- రోజుకు 1 లేదా 2 గ్లాసుల లెమన్ వాటర్ సరిపోతుంది.
- ఒక గ్లాస్ నీటిలో అర నిమ్మకాయ రసం కలిపి తీసుకుంటే చాలు.
- ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్, మధ్యాహ్నం లేదా సాయంత్రం ఒక గ్లాస్ తాగవచ్చు.
- అంతకుమించి ఎక్కువగా తాగితే యాసిడ్ ఎక్కువై గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు.
- అలాగే దంతాల ఎమల్షన్ దెబ్బతినే అవకాశం ఉంది.
- నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.
- ఇవి రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియను మెరుగుపర్చుతుంది.
- అలాగే గుండె ఆరోగ్యాన్ని రక్షించడం, చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడతాయి.
- బరువు తగ్గాలనుకునే వారికి, శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి ఇది అద్భుతమైన ఔషధం.
- గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
- భోజనం తర్వాత తాగితే ఇంకా మంచిది.
- నిమ్మరసం నీరు మెటాబాలిజాన్ని పెంచి.. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
- ఖాళీ కడుపుతో ఉదయం తాగితే ఫలితం ఎక్కువగా ఉంటుంది.
- జీవక్రియ మెరుగుపడితే కేలరీలు త్వరగా బర్న్ అవుతాయి. ఫ్యాట్ కంట్రోల్ అవుతుంది.
- నిమ్మరసంలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.
- ఇవి నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. ఉదయం తాగితే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది.
- లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది.
- దీనివల్ల అలసట దూరమై.. ఎనర్జిటిక్గా ఉంటారు.
- తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- నిమ్మరసంలోని ఆమ్లం దంతాల ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది.
- కాబట్టి తాగిన తర్వాత నీటితో నోటిని శుభ్రం చేసుకోవడం మంచిది.
- రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసుల కంటే ఎక్కువ తాగకూడదు.
- జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు పరగడుపున నిమ్మరసం తాగడం వల్ల కడుపులో ఆమ్ల స్థాయిలు పెరుగుతాయి.

