శ్రీవారికి భారీ స్వర్ణ కానుక

శ్రీవారికి భారీ స్వర్ణ కానుక

  • రూ.94.80 లక్షల విలువైన బంగారు పతకాల విరాళం

తిరుమల, ఆంధ్రప్రభ: కలియుగ దైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిపై ఉన్న భక్తి ప్రపత్తులను ఓ భక్తురాలు భారీ విరాళం రూపంలో చాటుకున్నారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ ఎం.మహదేవమ్మ అనే దాత శుక్రవారం స్వామివారికి మురిపాలొలికే 7 స్వర్ణ పతకాలను కానుకగా అందచేశారు.
వీటి విలువ సుమారు రూ. 94.80 లక్షలు ఉంటుందని అంచనా. శుక్రవారం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. దాత డాక్టర్ మహదేవమ్మ ఈ పతకాలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరిలకు స్వయంగా అందజేశారు.

Leave a Reply