ఉద్యమకారుల సంక్షేమం కోసం కృషి

ఉద్యమకారుల సంక్షేమం కోసం కృషి
-కొలను శ్రీనివాస్ రెడ్డి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం మునుగోడు నియోజకవర్గం కార్యదర్శిగా చౌటుప్పల్ మండలంలోని అల్లాపురం గ్రామ మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ గురువారం ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర చైర్మన్ కాచం సత్యనారాయణ నియామక పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… తనను కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, రాష్ట్ర చైర్మన్ కాచం సత్యనారాయణ, సహకరించిన ఉద్యమకారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం కృషి చేస్తానని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
