విజయవంతంగా ముగిసిన జనగణన శిక్షణ

విజయవంతంగా ముగిసిన జనగణన శిక్షణ

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: జనగణన 2027లో భాగంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో గత మూడు రోజులుగా జరుగుతున్న జనాభా గణన మొదటి విడత శిక్షణ కార్యక్రమం ముగిసిందని జనాభా గణన చార్జ్ ఇంచార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ తహసీల్దార్ మాట్లాడుతూ.. గత మూడు రోజుల నుండి జనగణన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో 6గురు సూపర్వైజర్ కు 34 మంది ఎన్యుమరేటర్ల కు శిక్షణను విజయవంతంగా చేయడం జరిగిందని అన్నారు. సూపర్వైజర్లకు, ఎన్యుమ రేటర్లకు శిక్షణ సామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎలక్షన్ డ్యూటీ అశ్విన్ బాబు, మాస్టర్ ట్రేనర్స్ గా శేఖర్, సత్యనారాయణ, ఛార్జ్ సెన్సస్ క్లర్క్ శివ, ఉపాధ్యాయులు కర్నాల శ్రీనివాస్, రాజశేఖర్ వీరేష్ రెడ్డి నీల శ్రీనివాస్, డి. శ్రీనివాస్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

2వ విడత శిక్షణ కార్యక్రమం 23 ఏప్రిల్ నుండి ప్రారంభం కానుందని, జనాభా గణన 2027 లో భాగంగా మొదటి విడత లో హౌస్ లిస్టింగ్ మే 11 నుండి జూన్ 9 వరకు, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు జరుగుతుందనీ ఇంచార్జి తహసీల్దార్, ఛార్జ్ ఆఫీసర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు.

Leave a Reply