Ap-Cm-Comments : వెస్ట్ ఈజ్ బెస్ట్.. కానీ Andhra Prabha Spl News
Ap-Cm-Comments : వెస్ట్ ఈజ్ బెస్ట్.. కానీ Andhra Prabha Spl News
- సెంటు భూమి దొరకదు
- అందుకే పరిశ్రమలు రావు
- సిద్ధాంతంలో ఏసీ సీఎం సెటైర్
( ఆంధ్రప్రభ, భీమవరం బ్యూరో )
Ap-Cm-Comments : పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఎంతో అభిమానం. నన్ను ఆదరించిన జిల్లా ఇదే. ఇక్కడకు వస్తే.. ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక పక్క గోదావరి గలగల .. మరో వైపు కొబ్బరి తోటలు.. కనీసం సెంటు భూమి కూడా వదలకుండా ఇక్కడ రైతులు చెట్లను నాటుతారు. అందుకే నాకు ఎంతో గౌరవం. భారత దేశ ప్రజలకు అన్నం పెట్టిన ఈ ప్రాంతం చాలా గొప్పది అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పశ్చిమ గోదావరి జిల్లాను ప్రశంసించారు.

సిద్ధాంతం గ్రామంలో మీ భూమి, మీ హక్కు కార్యక్రమంలో ఆయన పశ్చిమ గోదావరి జిల్లాకు కితాబు ఇస్తునే.. భూమి కొరతపై ఓ వ్యంగ్య బాణం వదిలారు. నేను ఎక్కడికి వెళ్లినా.. విశాఖ పట్నం వెళ్లినా.. రాయలసీమ వెళ్లినా.. అక్కడ భూమి ఇవ్వటానికి రైతులు ముందుకు వస్తారు. అందుకే అక్కడ పరిశ్రమలు వస్తున్నాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో సెంబు భూమి కూడా ఇవ్వరు. అదే పెద్ద సమస్య. భూమి సేకరణ కష్టం. ఆక్వా కారిడార్ వస్తోంది. పరిశ్రమలూ రావాలి. మరి భూమి విషయమే.. ఇక్కడ అర్థం కాదు.. అని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
