పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం…

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం…

ఇంద్రకీలాద్రిపై జనసేన నేతల ప్రత్యేక మొక్కు
మోకాళ్లపై మెట్లు ఎక్కుతూ కనకదుర్గమ్మ సన్నిధిలో పూజలు
నాయకత్వం వహించిన రీజియన్ కోఆర్డినేటర్ రావి సౌజన్య
స్వాగతం పలికిన దుర్గ గుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ
త్వరితగతిన కోలుకోవాలని అమ్మవారిని ప్రార్థించిన కార్యకర్తలు
ప్రజా సేవలో మరింత ఉత్సాహంతో కొనసాగాలని ఆకాంక్ష

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై జనసేన నాయకులు, కార్యకర్తలు విశేష భక్తిశ్రద్ధలతో మొక్కుబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కృష్ణా, పెన్నా రీజియన్ కోఆర్డినేటర్ రావి సౌజన్య ఆధ్వర్యంలో జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.

కొండ దిగువ భాగం నుంచి పైవరకు మోకాళ్లపై నడుస్తూ మెట్ల పూజ నిర్వహించారు. తమ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ అస్వస్థత నుండి త్వరగా కోలుకుని, ప్రజా సేవలో మరింత చురుకుగా పాల్గొనాలని కోరుకుంటూ ఈ కఠినమైన మొక్కును చెల్లించుకున్నామని పాల్గొన్న నాయకులు తెలిపారు. కార్యక్రమం సందర్భంగా కొండపైకి చేరుకున్న జనసేన నాయకులను శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ సాదరంగా ఆహ్వానించారు.

వారికి అమ్మవారి దర్శనం కల్పించి, ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి విధుల్లో పాల్గొని రాష్ట్ర అభివృద్ధికి మరింత సేవలందించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply