Balayya | డింపుల్ ఉన్నట్టా..? లేనట్టా..?

Balayya | డింపుల్ ఉన్నట్టా..? లేనట్టా..?
Balayya | సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డింపుల్ వార్త
బాలయ్య-గోపీచంద్ కాంబోపై భారీ అంచనాలు
డింపుల్ హయతి కెరీర్ హైలైట్స్
ఎయిర్‌పోర్ట్ మీట్‌తో మళ్లీ మొదలైన ప్రచారం
Balayya | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నందమూరి బాలకృష్ణ స్పీడు మామూలుగా లేదు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే.. రెండు మూడు ప్రాజెక్టులు ఫైనల్ అయి షూటింగ్ కి రెడీగా ఉంటున్నాయి. ఇదిలా ఉంటే.. బాలయ్య మూవీలో నటించేందుకు సీనియర్ హీరోయిన్స్ అండ్ యంగ్ హీరోయిన్స్ వేయిట్ చేస్తున్నారు. ఇటీవల డింపుల్ హయతి బాలయ్య సినిమాలో నటిస్తున్నట్టుగా వార్తలు వస్తే.. డైరెక్టర్ మలినేని గోపీచంద్ ఖండించారు. ఇప్పుడు బాలయ్యతో కలిసి డింపుల్ కనిపించడంతో మళ్లీ ప్రచారం మొదలైంది. ఇంతకీ.. బాలయ్య మూవీలో డింపుల్ ఉన్నట్టా..? లేనట్టా..?

Balayya | షోషల్ మీడియాని షేక్ చేస్తున్న డింపుల్..
టాలీవుడ్‌లో తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. హీరోయిన్ డింపుల్ హయతి నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న కొత్త సినిమాలో కనిపించబోతుందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మలినేని గోపీచంద్ ఈ వార్తలను ఖండించినా మళ్లీ న్యూస్ వైరల్ కావడం విశేషం. బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో గత చిత్రం వీరసింహారెడ్డి మంచి విజయం సాధించడంతో, ఈ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తి నెలకొంది. ఈసారి కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో, ముఖ్యంగా ముంబై నేపథ్యంలో కథ సాగుతుందని టాక్ వినిపిస్తోంది.

Balayya | సీనియర్ హీరోలకు పర్ ఫెక్ట్ ఛాయిస్..
ఇక హీరోయిన్ విషయానికి వస్తే, ప్రధాన కథానాయికగా నయనతార పేరు వినిపిస్తుంది. మరో హీరోయిన్ పాత్ర పై కూడా స్పష్టత లేదు. డింపుల్ హయతి విషయానికి వస్తే, ఆమె ఇప్పటికే టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఖిలాడి, గద్దలకొండ గణేష్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో కూడా కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడయపోయినా సంక్రాంతికి రావడం వలన యావరేజ్ గా నిలిచింది. ఈ అమ్మడు సీనియర్ హీరోల సరసన నటించేందుకు పర్ ఫెక్ట్ ఛాయిస్ అనే పేరు తెచ్చుకుంది.

Balayya | బాలయ్య మనసు దోచుకున్న డింపుల్..
ఇదిలా ఉంటే.. ఇటీవల ఎయిర్ పోర్టులో బాలయ్య, డింపుల్ హయతి కలుసుకున్నారు. ఆ టైంలో హయతి బాలయ్యతో చాలా సేపు ముచ్చటించడం, ఆ తర్వాత వెళ్తుండగా ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకొంది. బాలయ్య కూడా ఆమెని ఆప్యాయంగా ఆశీర్వదించారు. ఈ ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చినప్పటి నుంచి బాలయ్య డింపుల్ కు ఛాన్స్ ఇస్తారని.. ప్రస్తుతం చేస్తున్న మూవీలో డింపుల్ నటించడం ఖాయం అంటూ ప్రచారం ఊపందుకుంది. దీంతో మలినేని గోపీచంద్ ఈ సినిమాలో డింపుల్ నటించడం లేదని చెప్పారు కాబట్టి.. అది నిజమౌతాదా..? లేక బాలయ్య ఆశీర్వాదించారు కాబట్టి ఈ సినిమాలో డింపుల్ నటించే ఛాన్స్ దక్కించుకుందా..? అనేది సస్పెన్స్ గా మారింది. మరి.. త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

