9,000 Crores | కాళేశ్వరం స్కాంలో కేసీఆర్ ను కాపాడుతోంది రేవంత్ రెడ్డే..
9,000 Crores | కాళేశ్వరం స్కాంలో కేసీఆర్ ను కాపాడుతోంది రేవంత్ రెడ్డే..
రూ.9 వేల కోట్లపైనే విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాశారు
లక్ష కోట్ల అవినీతిపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
9,000 Crores | కరీంనగర్ రూరల్ ఆంధ్రప్రభ : తెలంగాణకు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ లు రాహు కేతువుల తయారయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మంగళవారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజలను చంపకు తింటున్నారన్నారు. కాలేశ్వరం స్కామ్ లో కెసిఆర్ను కాపాడుతుంది రేవంత్ రెడ్డి అని 9000 కోట్ల అవినీతిపై విచారణ కోరిన సీఎం లక్ష కోట్ల అవినీతిపై ఎందుకు విచారణ కోరడం లేదన్నారు.
తేజస్వీ వ్యాఖ్యలను కాంగ్రెస్, బీఆర్ఎస్ వక్రీకరించాయి
తెలంగాణ ఉద్యమకారులను తేజస్వీ దేశభక్తులతో పోల్చారు.
తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకుంటే అడ్డుకున్నది బీజేపీయే. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు కల్ల
బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని అధికారం పంచుకున్న చరిత్ర కాంగ్రెస్ దే. బిఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదు.జమిలి ఎన్నికలొస్తే బీజేపీ గెలుస్తుందనే భయం రేవంత్ కు పట్టుకుంది.
రాహుల్ గాంధీని జనం విశ్వసించడం లేదు
రాహుల్ గాంధీని జనం నమ్మడం లేదు. అందుకే రాహుల్ స్థానాన్ని ఆక్రమించాలని రేవంత్ రెడ్డి చేస్తున్నారు.దక్షిణాదికి అన్యాయమంటూ గగ్గోలు పెట్టడం వెనుక అసలు కారణం ఇదే.డీలిమిటేషన్ బిల్లును అడ్డుకుని దక్షిణాదికి అన్యాయం చేసింది రేవంత్, స్టాలినే.
మహిళా బిల్లును అడ్డుకుని కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, టీఎంసీ తప్పు చేశాయి
మహిళా బిల్లును అడ్డుకొని మూడు పార్టీలు తప్పుచేసి దేశ మహిళలకు తీరని అన్యాయం చేశారు. ఆ పార్టీల ద్రుష్టిలో మహిళలంటే సోనియా, ప్రియాంక, డింపుల్, కనిమొళి మాత్రమే. వాళ్లకు పదవులిస్తే మహిళలకు న్యాయం జరిగినట్లేనని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో మహిళలు మూడు పార్టీలను బహిష్కరిస్తారు.సాధారణ మహిళలు చట్టసభల్లోకి వస్తే కుటుంబ పార్టీల పునాదులు కదిలిపోతాయనే భయం పట్టుకుంది.అందుకే మహిళా భిల్లును అడ్డుకున్నాయి.
