State Minister | హరీష్ రావుకు తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్

State Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి హరీష్ రావుపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించకపోవడం వల్లే హరీష్ రావు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతికి పాల్పడ్డ హరీష్ రావు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి నీతులు చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆశలపై మట్టి పోసిందని, రాజకీయ పార్టీలను మోసం చేస్తూ, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలతో రాష్ట్రాన్ని ‘రావణ కాష్టం’లా మార్చారని తుమ్మల ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన దోపిడీని గుర్తించే ప్రజలు ఆ పార్టీని పక్కన పెట్టారని.. హరీష్ రావు బతికుండగా బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు.