వాహ‌నాలు న‌డిపే ప్ర‌తి ఒక్క‌రు సీట్ బెల్ట్, హెల్మెట్ ధ‌రించాలి..

వాహ‌నాలు న‌డిపే ప్ర‌తి ఒక్క‌రు సీట్ బెల్ట్, హెల్మెట్ ధ‌రించాలి..

బాలనగర్, ఆంధ్రప్రభ : బాలనగర్ మండల కేంద్రంలో 99 రోజుల ప్రజా ప్రణాళిక లో భాగంగా బాలనగర్ మండల కేంద్రంలోతెలంగాణ రాష్ట్రడిజిపి శశిధర్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా బాలనగర్ మండల పరిధిలోని పెద్దయ్య పల్లి గేటు వద్ద ఏర్పాట చేసిన కార్యక్రమంలో డిజిపి, ఎమ్మెల్యే ప్రత్యేకంగా సభను ఉద్దేశించి మాట్లాడారు అంతకుముందు ఎమ్మెల్యే జనం పల్లి అనిరుద్ రెడ్డి పూల మొక్క ఇచ్చి స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర డిజిపిశశిధర్ రెడ్డికి. ఐజి చౌహన్ మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి, డిఎస్పి వెంకటేశ్వర్లుజడ్చర్ల సిఐ బాలనగర్ ఎస్సై లెనిన్ఆధ్వర్యంలో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా డిజిపి, ఎమ్మెల్యే మాట్లాడుతూ కారు నడిపించేవారు కారులో ఉన్న సీటు బెల్టును కచ్చితంగా ధరించాలని వారు సూచించారు. కారులో ఎంతమంది ప్రయాణిస్తే అంతమంది సీటు బెల్టు ధరించాలని రోడ్డు నిబంధనలో కచ్చితంగా పాటించాలని ఈసందర్భంగా వారు సూచించారు.

ద్విచక్ర వాహనాలు ఎలిమెంట్ కచ్చితంగా ధరించాలని రోడ్డు ప్రమాదాల్లో జరగకుండా ప్రతి వాహనాదారుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం బాలనగర్ మండల పరిధిలోని అన్ని గ్రామాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply