టీడీపీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్ల సంబరాలు…

టీడీపీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్ల సంబరాలు…
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియమితులు ఆయన సందర్భంగా బుధవారం ఉరవకొండ తెలుగుదేశం పార్టీ కార్యాల యంలో టిడిపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాలు మెరుకు, స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి నాయకులు కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ నాటి యువగళం అడుగుల నుంచి, నేటి అభివృద్ది పరుగులు వరకు, నాడు ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి, నేడు పెట్టుబడుల వరద వరకు, కార్యకర్తకు భరోసా నుంచి వాళ్లను నాయకులుగా మార్చే వరకు, పార్టీలో, ప్రభుత్వంలో, ప్రజల హృదయాల్లో తిరుగులేని ముద్ర వేసుకున్న నారా లోకేష్ 44 ఏళ్ల తెలుగుదేశం పార్టీ కి నేషనల్ వర్కింగ్ ప్రసిడెంట్ ఎంపికయ్యారన్నారు.
గ్రామ కార్యకర్తల నుంచి రాష్ట్ర నేతల వరకు ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకునే సమయం ఇది. నారా లోకేష్ ను పదవి తో గౌరవించడం అంటే పార్టీ జెండాను గౌరవించడమే, ప్రతి కార్యకర్త కష్టాన్ని గౌరవించడమే అన్నారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ మార్కెట్ చైర్మన్ విజయ భాస్కర్, పెన్నాహోబిలం ఆలయ చైర్మన్ రేగటి నాగరాజు, పట్టణ టిడిపి అధ్యక్షులు రామాంజనేయులు, ఉరవకొండ సింగల్ విండో అధ్యక్షులు ప్యారం కేశవానంద, రామాంజనేయులు, మాజీ సర్పంచ్ గోవిందు, రాజేష్, సుధాకర్, రాంప్రసాద్, తిమ్మప్ప, రఘురాములు, కుమార్ స్వామి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
