మాదాసి కుర్వలకు ప్రభుత్వం ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి…

మాదాసి కుర్వలకు ప్రభుత్వం ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం మాదాసి కుర్వ కులస్తులకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని అమీన్ పూర్ మాదాసి కుర్వ సంఘం అధ్యక్షులు చిన్న అయ్యలప్ప విజ్ఞప్తి చేశారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని అమీన్ పూర్ లో అంబేద్కర్ 135వ జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించితమకు ఎస్సీ కుల ధ్రువీకరణపత్రాలు ఇప్పించేవిధంగాచూడాలనివిజ్ఞప్తిచేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదాసి కుర్వ కులస్తులు రాత్రి పగలు తేడా లేకుండా గొర్రెలు మేకలు కాస్తూ రాత్రి పగలు తేడా లేకుండా అడవిలో జీవనం కొనసాగిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం తమకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో తమకు సర్టిఫికెట్లు ఇచ్చేవరకు పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సర్పంచ్ టప్ప నాగేష్, మాదాసి కుర్వ సంఘంఉపాధ్యాయుడు డి నరసప్ప, జి సిద్ధప్ప, రమేష్, కే నర్సప్ప, జి చిన్న నరసప్ప, నరసప్ప, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply