భారతదేశ చరిత్రలో డాక్టర్ అంబేద్కర్ ఒక మహానుభావుడు

భారతదేశ చరిత్రలో డాక్టర్ అంబేద్కర్ ఒక మహానుభావుడు
డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే వెడమ బోజ్జు..
నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : అంబేద్కర్ సమానత్వానికి ప్రతీక, న్యాయానికి ప్రతినిధి, సామాజిక మార్పుకు మార్గదర్శి అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. నిర్మల్ పట్టణంలోని మీని ట్యాంక్ బండ్, గొల్లపెట్ కాలనిలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీహరిరావు, గ్రంధాలయ చైర్మన్ అర్జుమాంద్ అలీతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
స్థానికులతో కలిసి సహా పంక్తి భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలి. కుల, మత, భేదభావాలు లేకుండా అందరూ సమానంగా ఎదగాలని ఆయన రచించిన భారత రాజ్యాంగం మన దేశానికి ఎంతో బలమైన పునాది అన్నారు.
ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో కూడా ఆయన ఆలోచనలు చాలా ప్రాముఖ్యమైనవని, నేటి యువత చెడు మార్గాలు, దురలవాట్లకు ఆకర్షితులు కాకుండా అంబేద్కర్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, చదువు ద్వారా ఎదిగి సమాజానికి సేవ చేయాలన్నారు.. మన హక్కులను కాపాడుకోవడం మాత్రమే కాదు, ఇతరుల హక్కులను కూడా గౌరవించాలని తెలిపారు. ఈ కాయక్రమంలో కౌన్సిలర్ లు, గొల్లపేట్ అంబేద్కర్ సంఘ నాయకులు, మైనారిటి నాయకులు పాల్గొన్నారు.
