అంబేద్కర్ రాజ్యాంగం వలనే ప్రతి ఒక్కరికి రాజ్యాంగఫలాలు

అంబేద్కర్ రాజ్యాంగం వలనే ప్రతి ఒక్కరికి రాజ్యాంగఫలాలు
- పీక వెంకన్న
చిట్యాల, ఆంధ్రప్రభ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వలనే ప్రతి ఒక్కరూ రాజ్యాంగఫలాలు పొందుతున్నామని బీజేపీ మండల అధ్యక్షుడు పీక వెంకన్న ముదిరాజ్ తెలిపారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం, వనిపాకల గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా పీక వెంకన్న ముదిరాజ్ వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, భారతదేశానికి జ్ఞానం, సమానత్వం, న్యాయం అనే మూడు మూల సూత్రాలను అందించిన మహానేత అని పేర్కొన్నారు. సమాజంలో ఇంకా ఉన్న అసమానతలను తొలగించేందుకు యువత ముందుండాలని, జ్ఞానం ద్వారానే నిజమైన స్వేచ్ఛ సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు.
