Telangana | 67మందిని మోసం చేసిన బాలకృష్ణ

Telangana | 67మందిని మోసం చేసిన బాలకృష్ణ

Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ CISF అధికారిగా హల్‌చల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లిళ్ల పేరుతో పలువురు మహిళలను మోసం చేసిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో CISF యూనిఫాం ధరించి నకిలీ అధికారిగా తిరుగుతున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి తాను CISF‌లో పనిచేస్తున్నానని చెప్పి ప్రజలను నమ్మబలికినట్లు పోలీసులు తెలిపారు.

మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో పోలీస్ వేషధారణతో యువతులకు వల వేసి, పెళ్లి పేరుతో ఇప్పటివరకు సుమారు 67 మంది మహిళలను మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న బాలకృష్ణను గుర్తించిన అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply