పురపాలక కోఆప్షన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్

సంగారెడ్డి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి పురపాలక సంఘంలో కోఆప్షన్ సభ్యుల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినట్టు మున్సిపల్ కమిషనర్ మట్ట శ్రీనివాసరెడ్డి తెలిపారు. మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగిన ఇద్దరు సభ్యులను (ఒకరు మహిళ అయి ఉండాలి) అలాగే అల్పసంఖ్యాక వర్గానికి చెందిన ఇద్దరు (2) సభ్యులను (ఒకరు మహిళ అయి ఉండాలి) కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోనున్నారు. అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర పూర్తి వివరాలు సంబంధిత కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. అర్హులైన అభ్యర్థులు నిర్దిష్ట గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా కోఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియను నిర్వహించనున్నట్లు పురపాలక సంఘం కమిషనర్ తెలిపారు.

Leave a Reply