ఏసీబీ వలలో మున్సిపల్ ఏఈ…

రూ. రెండు లక్షలు తీసుకుంటుండగా పట్టివేత

పెద్దపల్లి, ఆంధ్రప్రభ: మరో లంచగొండి అధికారి అవినీతి నిరోధక శాఖ చేతికి చిక్కాడు. పెద్దపల్లి మున్సిపల్ సతీష్ 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మున్సిపల్ పరిధిలో జరిగిన వర్క్ బిల్లు కోసం బత్తుల శ్రీను నుండి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అవినీతి నిరోధక శాఖ జెడి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు సమాచారం. దాడుల్లో కరీంనగర్ ఏసిబి డిఎస్పి మహేందర్ రెడ్డితో పాటు ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.