సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. టికెట్ల కోసం భక్తుల క్యూ

విశాఖపట్నం, ఆంధ్రప్రభ : సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం (చందనోత్సవం) టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సోమవారం నుంచి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విక్రయాలు ప్రారంభం కాగా.. బ్యాంకుల వద్ద భక్తులు పోటెత్తారు. సింహాచలం, విశాఖ నగరంలోని ఎంపిక చేసిన నాలుగు బ్యాంకు శాఖల్లో ఆఫ్‌లైన్ విక్రయాలు మొదలైన అరగంటలోనే మెజారిటీ టికెట్లు ఖాళీ అయ్యాయి.
మరోవైపు, ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొందేందుకు ప్రయత్నించిన భక్తులకు నిరాశే ఎదురైంది. సర్వర్ లోపం కారణంగా వెబ్‌సైట్ సక్రమంగా పనిచేయకపోవడంతో బుకింగ్స్‌కు అంతరాయం కలిగింది. ఏప్రిల్ 20న జరిగే ఈ వేడుక కోసం ప్రభుత్వం ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.

Leave a Reply