killed-hit-and-run : అదే ఆఖరి నడక Andhra Prabha Crime News

killed-hit-and-run : అదే ఆఖరి నడక Andhra Prabha Crime News

  • ఏపీఎస్పీ కానిస్టేబుల్​ దుర్మరణం
  • మార్నింగ్​ వాకింగ్ చేస్తుండగా…
  • .గుర్తుతెలియని వాహనం హిట్​ అండ్​ రన్
  • కర్నూలులో విషాదం ​

(కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ)

killed-hit-and-run : కర్నూలు నగరంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతి చెందారు. నగరంలోని బళ్లారి చౌరస్తా జాతీయ రహదారి వద్ద వాకింగ్ చేస్తున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ వరప్రసాద్ (43)ను గుర్తుతెలియని వాహనం ఢీకొంది.దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం పట్ల పోలీసు వర్గాల్లో విషాదం నెలకొంది.