KTR | క్యాత‌న‌ప‌ల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ కుట్ర‌లు..

KTR | క్యాత‌న‌ప‌ల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ కుట్ర‌లు..

KTR | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : మంత్రి వివేక్ ఫోన్ చేసి త‌న‌ను అడుక్కుంటే క్యాత‌న‌ప‌ల్లి మున్సిపాలిటీని వదిలేసే వాళ్ళమని కేటీఆర్ అన్నారు. ఆదివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. క్యాత‌న‌ప‌ల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ సాధించినా కాంగ్రెస్ నేతలు నీచ రాజ‌కీయాలు చేసి చైర్మ‌న్ పీఠాన్ని ద‌క్కించుకోవాల‌నే కుట్ర‌లు చేశార‌ని కేటీఆర్ మండిపడ్డారు. ఒక్క మున్సిపాలిటీ కోసం మంత్రి వివేక్ దాడులు, అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూశారన్నారు. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌ను జైలులో పెట్టి ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు ఇంత చేసినా.. క్యాత‌న‌ప‌ల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బీఆర్ఎస్-సీపీఐ నేతలకు అభినందనలు తెలిపారు.

Leave a Reply