Moaist Leader Miss : అగ్ర నేత బెస్రా,, మళ్లీ మాయం ? Andhrfa Prabha Spl News

Moaist Leader Miss : అగ్ర నేత బెస్రా,, మళ్లీ మాయం ? Andhrfa Prabha Spl News

  • పోరాహట్ అటవీలో ఎన్​ కౌంటర్​
  • మావోయిస్టులందరూ అడవిలో అదృశ్యం
  • కోటి రివార్డు నేత ఆచూకీపై ఉత్కంఠ
  • అతడి కోసం కగార్​ దళాలు వేట
  • జార్ఖండ్​ లో కలకలం

( ఆంధ్రప్రభ, చైబాసా (జార్ఖండ్):

Moaist Leader Miss : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్​ ఆపరేషన్​ లో… ప్రాణాలతో మిగిలిన కీలక అగ్ర మిసిర్ బెస్రా కోసం గత రెండు నెలలుగా భద్రతదళాలు జల్లెడ పడుతున్నా.. బెస్రా ఆచూకీ లభించటం లేదు. ఆయన తలపై కోటి రూపాయల రివార్డు ఉన్న విషయం విధితమే. మంగళవారం ఉదయం జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌ భూమ్ జిల్లాలో జరిగిన ఎన్​ కౌంటర్​ లో బెస్రా తప్పించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
జార్ఖండ లోని సోనువా పోలీస్ స్టేషన్ పరిధిలోని కేదాబీర్ గ్రామం సమీపంలో పోరాహట్ అటవీ ప్రాంతంలో ఎన్​ కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ రేణు తెలిపారు. భద్రతా సిబ్బంది సాధారణ గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కూంబింగ్​ జరుపుతున్న భద్రతా సిబ్బందిని గమనించిన మావోయిస్టులు కాల్పులు జరపగా, భద్రత సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు.

Moaist Leader Miss : మావోయిస్టులు అదృశ్యం

దీంతో జరిగిన కొద్దిపాటి ఎన్‌కౌంటర్ అనంతరం నక్సల్స్ మరింత దట్టమైన అడవిలోకి వెళ్లిపోయారు. తప్పించుకున్న మావోయిస్టుల్లో అగ్ర నాయకుడు మిసిర్ బెస్రా సహా మరికొందరు మావోయిస్టులు ఈ జిల్లాలో ఇంకా చురుకుగా ఉన్నారని ఎస్పీ తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ రోజు జరిగిన ఎన్​ కౌంటర్​ లో బెస్రా ఉన్నాడా? లేదా? ఉంటే తప్పించుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Leave a Reply