గుండెపోటుతో ఏఎన్ఎం భూలక్ష్మి మృతి

పెడన, ఆంధ్రప్రభ : పెడన పట్టణంలోని 6వ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎం ఆత్మూరి భూలక్ష్మి (43) ఆదివారం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆమె పెడన మండలం నడుపూరు గ్రామానికి చెందినవారు.
ఆమె మృతి వార్త తెలిసిన వెంటనే పెడన సచివాలయ ఉద్యోగులు నడుపూరు గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భూలక్ష్మి సేవలను స్మరించుకుంటూ సహోద్యోగులు నివాళులు అర్పించారు.
