ప్రణాళికబద్ధంగా చదివి ఎక్కువ మార్కులు సాధించాలి

ప్రణాళికబద్ధంగా చదివి ఎక్కువ మార్కులు సాధించాలి
- న్యాయవాది చెరుకు శివ గౌడ్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదివి పరీక్షలలో ఎక్కువ మార్కులను సాధించవచ్చునని చౌటుప్పల్ పట్టడానికి చెందిన ప్రముఖ న్యాయవాది చెరుకు శివ గౌడ్ తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ రత్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఈప్ సెట్ శిక్షణ తరగతులలో న్యాయవాది చెరుకు శివ గౌడ్ శనివారం గెస్ట్ లెక్చరర్ గా హాజరై విద్యార్థులకు ఎక్కువ మార్కులు ఎలా సాధించాలో వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉచిత శిక్షణ అందిస్తున్న యాజమాన్యానికి ధన్యవాదములు తెలిపారు. అనంతరం చెరుకు శివకుమార్ గౌడ్ ను శాలువాతో సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో రత్నం ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
