తరతరాలకు మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు పూలే

హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ ; భారతదేశ గొప్ప సంఘ సంస్కర్తల్లో ఒకరైన మహాత్మ జ్యోతిరావు పూలే తరతరాలకు మార్గదర్శని మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ధూళిపాల శ్రీనివాసరావు లు అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
మహారాష్ట్రలో 1827లో మహాత్మ జ్యోతిరావు పూలే జన్మించారని, అతి సామాన్య నేపథ్యం నుంచి ఎదిగి కష్టపడి జ్ఞానాన్ని ఆర్జించి జ్ఞానం కొందరి గుత్తాధిపత్యం కాదని జ్ఞానం అందరికీ అందాలని స్పష్టంగా గుర్తించి సమాజంలో అందని ద్రాక్షలా ఉన్న విద్యను ఆ కాలంలోనే బాలికల కోసం, విద్యా అవకాశాలేని వర్గాల కోసం పాఠశాలను తెరిచి విద్యా విప్లవానికి నాంది పలికారన్నారు. సామాజిక న్యాయాన్ని సమానత్వాన్ని సాధించే శక్తివంతమైన సాధనంగా తరగతి గదిని నిలిపి ఓ సరికొత్త సామాజిక దృక్పథాన్ని ఆవిష్కరించేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు. నేటి తరానికి ఆయన ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్ శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, కౌన్సిలర్స్ మొదాల సైదులు, కొమ్ము శ్రీనివాస్ బెల్లంకొండ అమర్, సులువ చంద్రశేఖర్, యడ్ల విజయ్ అమరబోయిన సతీష్, జక్కుల నరేందర్ బెల్లంకొండ శ్రీనివాస్, కొలపూడి యోహాను జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు బొడ్డు గోవిందరావు శెట్టి శ్రీనివాస్, చేపూరి నరసింహ చారి, కొత్తూరి బ్రహ్మచారి, ఒట్టికూటి శ్రీనివాస్ గౌడ్, బండి నాగేశ్వరరావు, నందిగామ ముక్కంటి, మేకల సైదయ్య, జక్కుల వెంకటేశ్వర్లు, భీమ్ శెట్టి రవికుమార్, గొట్టే ఆంజనేయులు పాల్గొన్నారు.
