కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్

కొండగట్టు, ఆంధ్రప్రభ ; కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు సాయిధరమ్ తేజ్ దర్శించుకున్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయానికి విచ్చేసిన సాయి ధరమ్ తేజ్ కు అర్చకులు వేదమంత్ర ఉత్సరణతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు సాయిధరమ్ కు వేదోక్త ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి శాలువా కప్పి సత్కరించి, లడ్డు ప్రసాదం అందించారు.
