జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలకు పిలుపు

నార్సింగి, ఆంధ్రప్రభ : జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఏప్రిల్ 11న నార్సింగి మండలంలో వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నార్సింగి మండలంలోని బీసీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, బీసీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కార్మికులు, కర్షకులు, ప్రజాసంఘాల నాయకులు, రైతులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
