Polepalli | రేణుక ఎల్లమ్మ తల్లి బ్ర‌హ్మోత్స‌వాలు – ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన రేవంత్

వికారాబాద్ జిల్లా పోలేపల్లిలో రేణుక ఎల్లమ్మ తల్లి బ్ర‌హ్మోత్స‌వాలు నేటి నుంచి ప్రారంభ‌మ‌య్యాయి.. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆలయానికి చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు రేవంత్రెడ్డికి అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.

అంత‌కు ముందు ఆల‌యానికి చేరుకున్న రేవంత్ కు వేద‌పండితులు, ఆల‌య అధికారులు ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స్వాగ‌తం ప‌లికారు. ఈ ప‌ర్య‌ట‌న సీఎం వెంట మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Leave a Reply