1% Profit Rally : హమ్మయ్యా.. లాభం Andhra Prabha News

1% Profit Rally : హమ్మయ్యా.. లాభం Andhra Prabha News

  • టాపర్ దక్షిణ కొరియా ​
  • భారత్​ దూకుడే దూకుడు
  • ఆసియా మార్కెట్లల్లో జోష్​
  • జపాన్​ సూచీ పరుగే పరుగు
  • ప్రాఫిట్​ ల్లో చైనా , హాంగ్‌కాంగ్
  • నష్టాల్లో ఆస్ట్రేలియా
  • బ్యాంకింగ్ షేర్లలో భారీ కొనుగోళ్లు
  • టీసీఎస్ దెబ్బతో ఐటీ రంగం ఒత్తిడి
  • చమురు ధరలు, జియోపాలిటిక్స్ ప్రభావం

( ఆంధ్రప్రభ, ముంబై ప్రతినిధి)

1% Profit Rally : లెబానాన్​ ఇజ్రాయెల్​ నరమేధం దాడి ఉద్రిక్తతలకు దారి తీసినా.. ప్రధానంగా అమె రికా, ఇరాన్​ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ.. పాకిస్థాన్​ లో శాంతి చర్చలు ఆసియా మార్కెట్లకు ఆక్సిజన్​ అందించాయి. ఓ బలవత్తర టానిక్కును గుటక వేసిన ఆసియా మార్కెట్​ శుక్రవారం కూడా యమ జోష్​ గా పరుగులు తీస్తోంది. ఆస్ట్రేలియా మినహా మిగిలిన .. జపాన్​ నుంచి ఇండియా వరకూ స్టాక్​ మార్కెట్ల సూచీలు దూసుకుపోతున్నయి.

1% Profit Rally

1% Profit Rally : అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ.. తాజా పరిస్థితుల నేపథ్యంలో.. మదుపర్లు నిశితంగా గమనించి అడుగులు వేస్తున్నారు. ఫలితంగా ఆసియా స్టాక్ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. జపాన్, దక్షిణ కొరియా, భారత్​, చైనా, హాంగ్‌కాంగ్‌లలోని బెంచ్‌మార్క్ సూచీలు లాభాల్లో ఉండగా, ఓక్క ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 200 పాయింట్లు పడిపోయి 0.5 శాతం నష్టపోయింది. దక్షిణ కొరియా (Kospi) 1.8% తో ఆసియాలోనే అత్యధిక వృద్ధిని కనబరిచింది. (Nikkei 225 పాయింట్లతో 1.6% శాతం వృద్ధితో కొనుగోళ్లు పుంజుకున్నాయి. 0.95% – దాదాపు 1% వృద్ధిని నమోదు చేసింది. అంచనాల కంటే ద్రవ్యోల్బణం తగ్గడంతో చైనా (Shanghai Composite): 0.6% – 0.9% – లాభపడింది. 0.7% శాతంతో హాంగ్‌కాంగ్ (Hang Seng) పుంజుకుంది. 200 పాయింట్లు క్షీణించి ఆస్ట్రేలియా (S&P/ASX 200): -0.4% నష్టపోయింది. భారత్​ లో శుక్రవారం కూడా దలాల్​ మార్కెట్​.. దూసుకుపోతోంది. సుమారు 730 పాయింట్లు (0.96%) లాభపడి 77,371 వద్ద సెన్సెక్స్ (BSE Sensex): కొనసాగుతోంది. నిఫ్టీ (Nifty 50) దాదాపు 225 పాయింట్లు (0.95%) పెరిగి 24,000 మార్కును దాటింది,

1% Profit Rally : ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ఆర్థిక సంస్థల షేర్లు మార్కెట్ పెరుగుదలతో బాంకింగ్​ రంగం జోష్​ లో ఉంది. టీసీఎస్ (TCS) తన త్రైమాసిక ఫలితాల వెల్లడి సుమారు 3% నష్టంతో ట్రేడవుతోంది. ఇలా ఐటీ రంగం ఒడిదుడుకుల్లో ఉంది. లెబనాన్​ పై ఇజ్రాయెల్​ దాడితో ఇరాన్​ మళ్లీ హోర్మజ్​ కు తాళం వేయటంతో.. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, కాల్పుల విరమణ చర్చలు మార్కెట్‌కు మద్దతునిస్తున్నాయి

ALSO READ : Iran Us Peace Talks : ఆ రెండే పీటముళ్లు Andhra Prabha Top Story

Leave a Reply