అంతంపేటలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం..

గట్టుప్పల, ఆంధ్రప్రభ : మండలంలోని అంతంపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమాన్ని సర్పంచ్ చందా శ్రీలత వెంకటేశం గురువారం నిర్వహించారు.

ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు దాసరి మల్లయ్య దంపతులు తమ సొంత ఇంటిలోకి అడుగుపెట్టడంతో ఆనందం వ్యక్తం చేశారు. సొంతింటి కల నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాధగోని శేఖర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మాధగోని వెంకటయ్య, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సైదులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply