ఉపాధి హామీ పనులు సద్వినియోగం చేసుకోవాలి

ఉపాధి హామీ పనులు సద్వినియోగం చేసుకోవాలి
గరిడేపల్లి, ఆంధ్రప్రభ: అర్హులైన ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని మండలంలోని గార కుంట తండా గ్రామ సర్పంచ్ బానోతు అరుణ రమేష్ నాయక్ కోరారు. సోమవారం గార కుంట తండా గ్రామంలో ఉపాధి హామీ పనులను ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఉదయం 6 గంటలకు వచ్చి 10 గంటల వరకు పనులు పూర్తి చేసుకోవాలని కోరారు. పనులు జరిగే ప్రదేశంలో ఉపాధి కూలీలకు నీడ కోసం టెన్త్, తాగునీరు, మెడికల్ కిట్ లాంటి సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గౌతమి సుధాకర్, గరిడేపల్లి మాజీ సర్పంచ్ సైదా నాయక్, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటరెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
