ఎండల నుంచి రక్షణకు హైవేపై పందిరి..

నార్సింగి, ఆంధ్రప్రభ : ఎండాకాలంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా నేషనల్ హైవే-44 నార్సింగి వద్ద హైవే పక్కన పందిరి ఏర్పాటు చేయిస్తున్న సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశం గౌడ్ అభినందనలు అందుకుంటున్నారు.

ప్రయాణికులు, వాహనదారులు ఎండ తీవ్రతకు గురికాకుండా తాత్కాలిక షెల్టర్ ఏర్పాటు చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజల సౌకర్యమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్న సర్పంచ్‌ను పలువురు అభినందించారు.

Leave a Reply