లేబర్ అడ్డాను మార్చండి..

లేబర్ అడ్డాను మార్చండి..
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆలంపల్లి రోడ్ లో గల లేబర అడ్డా ఉదయం వేళలో రద్దీగా ఉండడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రధానంగా ఆలంపల్లి రోడ్లో గల ఈ లేబర్ అడ్డా వద్ద ఉదయం ఆరు గంటల నుండి 9 గంటల వరకు పెద్ద ఎత్తున కార్మికులు ఇతర ప్రాంతాల నుండి వచ్చి పనుల కోసం ఎదురు చూస్తుంటారు.
ఈ ప్రాంతంలో వెళ్లాలంటే ప్రత్యక్ష నరకం అనుభవించాల్సి వస్తుంది. అధికారులు, పోలీసులు ఈ లేబర్ అడ్డాను ఇతర ప్రాంతాలకు మార్చాలని స్థానికులు కోరుతున్నారు. ఉదయం వేళల్లో పాఠశాలలకు, కళాశాలకు, ఉద్యోగాలకు వెళ్లే వారికి ఈ లేబర్ అడ్డా అడ్డంకిగా మారుతుంది. అధికారులు స్పందించి ఈ లేబర్ అడ్డాను ఇతర ప్రాంతానికి మార్చాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
